
ByGanesh
Thu 12th Jun 2025 08:14 PM
ఆయన నిర్మాణంలో హీరోగా నటించిన సితారే జమీన్ పర్ విడుదల సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో మహాభారత తన లాస్ట్ ఫిలిం కాదు, నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ అమర్ ఖాన్ వివరణ ఇచ్చారు. మహాభారతం నా చివరి చిత్రం కాదు. నా సమాధానాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.
సదరు యాంకర్ మీరు ఏదైనా సినిమా తర్వాత నటనకు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందా అని అడిగితే దానికి సమాధానమిచ్చాను. ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చే ఏ పాత్రనైనా చేసాక అలా అనిపిస్తే చేస్తాను అన్నాను. దానితో అందరూ ఆ పాత్ర మహాభారతంలోనిదే అని, ఆ తర్వాత నేను ఇక నటించనని చాలామంది అనుకున్నారు. కానీ నేను చెప్పిన ఆన్సర్ ని జాగ్రత్తగా వినాలని అర్ధంచేసుకోవాలని కోరుతున్నా అంటూ ఆమిర్ చెప్పుకొచ్చారు.
Aamir Khan Shuts Down Retirement Buzz:
Aamir Khan reacts to the buzz about Mahabharat being his last film
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.