
సెట్లో ఏదైనా సంఘటన జరిగితే, దానిపై యాక్షన్ తీసుకునేందుకు నిర్మాతకు హక్కు ఉంది. అయితే ఈ ప్రముఖ నిర్మాత మాత్రం సంఘటనను బయటకు రానీయకుండా జాగ్రత్త పడటమే గాక, ఆ విషయం బయటకు తెలిసిపోయాక, సదరు నటీమణి ఆరోపించాక, సర్ధుబాటు చర్యలు చేపట్టారని అంతర్గతంగా గుసగుస వినిపిస్తోంది.
పైగా తమ నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను క్షమించను అని వ్యాఖ్యానించిన ఆ నిర్మాత, అసలు తమ సినిమా సెట్లలో ఆ వ్యక్తి పని చేయడం లేదని బొంకేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడిని టెంపరరీగానే తీసుకున్నాం. కేటాయించిన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు! అని కూడా వివరణ ఇచ్చారు. తమ నిర్మాణ సంస్థ అంతర్గత కమిటీ విచారించాలంటే కనీసం, ఆ యువతి ఫిర్యాదు అయినా చేసి ఉండాలి కదా? అలాంటి ఫిర్యాదులేవీ తమకు ఇప్పటివరకూ అందలేదని కూడా అతడు వివరణ ఇచ్చాడు.
అయితే బాధితురాలు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సినిమాటోగ్రాఫర్ పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే అయినా కానీ, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అతడు చెబుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ ని కాపాడాలనే తపన కాదు కానీ, తమ నిర్మాణ సంస్థకు బ్యాడ్ నేమ్ రాకుండా అతడు ఈ విధమైన సమాధానాలిస్తున్నాడని భావిస్తున్నారు. ఘటన టాలీవుడ్ లో జరిగిందా? బాలీవుడ్ లో జరిగిందా? అన్నది అటుంచితే, సెట్లో వేధింపులను ఆపేందుకు, మహిళా నటీమణులకు సౌకర్యాలు పెంచేందుకు కమిటీలు వేస్తున్నా, అవేవీ పని చేయడం లేదని, కేవలం క్రమశిక్షణ కమిటీలు కొద్దిరోజుల హంగామా మాత్రమేనని ప్రూవ్ అవుతోంది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.