
బాలకృష్ణ-బోయపాటి కలయికలో తెరకెక్కుతున్న అఖండ తాండవం దసరా రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. కానీ తేదీ ఖరారు చెయ్యలేదు. అదే దసరా అంటే సెప్టెంబర్ 25 న పవన్ కళ్యాణ్-సుజిత్ ల గ్యాంగ్ స్టర్ డ్రామా OG ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దానితో బాలయ్య అఖండ 2 దసరా నుంచి తప్పుకుంటుంది అనే ప్రచారం జరిగింది.
కానీ బాలయ్య బర్త్ డే సందర్భంగా వదిలిన అప్ డేట్ లో అఖండ 2 తాండవం సెప్టెంబర్ 25 దసరా రిలీజ్ అంటూ ప్రకటించారు. మరి అదే రోజు రిలీజ్ అవుతున్న పవన్ OG కి అదే రోజు విడుదల తేదీ ఇచ్చిన అఖండ 2 తాండవానికి యుద్ధం తప్పేలా లేదు, ఇది పవన్ vs బాలకృష్ణ అనేకన్నా పవన్ ఫ్యాన్స్ vs బాలయ్య ఫ్యాన్స్ అన్న రేంజ్ లో ఈ వార్ మారడం ఖాయం.
మరి పవన్, బాలయ్య ఇద్దరిలో ఎవ్వరూ తగ్గరు, దానితో సెప్టెంబర్ 25 బాక్సాఫీసు దగ్గర ఓ చిన్నపాటి యుద్ధం జరగడం గ్యారెంటీ… సో ఇప్పటినుంచే అభిమానులు ఒకరిపై ఒకరు పై చెయ్యి సాధిచడానికి ప్రిపేర్ అవుతున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.