
ByGanesh
Sun 08th Jun 2025 03:08 PM
ఇక అఖిల్ ఏజెంట్ తర్వాత రెండేళ్లు బ్రేక్ తీసుకుని లెనిన్ చిత్రం చేస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్లో అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా వదిలారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది.
అయితే తాజాగా లెనిన్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ శ్రీలీల కాగా స్పెషల్ సాంగ్ కోసం ఓ టాప్ హీరోయిన్ ని అప్రోచ్ అవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ వన్ మంత్ గ్యాప్ లో సాంగ్ ను షూట్ చెయ్యాలని, తర్వాత అఖిల్ షాట్స్ ను సాంగ్ లో యాడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి అఖిల్ లెనిన్ స్పెషల్ సాంగ్ కోసం ఏ భామ దిగుతుందో చూడాలి.
Special song to Akhil Lenin:
Akhil Lenin update
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.