
రామ్ చరణ్ ఇంకా ఉపాసన అఖిల్ పెళ్లిలోనే కాదు, వెడ్డింగ్ రిసెప్షన్ లోను సందడి చేసారు. సుకుమార్ అండ్ ఫ్యామిలీ, సూర్య, హీరో సుదీప్, కన్నడ స్టార్ యష్, వెంకీ అట్లూరి, రమ్యకృష్ణ, వెంకయ్య నాయుడు, రాఘవేంద్ర రావు.. కుర్ర హీరోలు నిఖిల్, అల్లరి నరేష్, నాని ఇలా చాలామంది హాజరయ్యారు. కాకపోతే అఖిల్ రిసెప్షన్ లో చాలామంది స్టార్ హీరోలు మిస్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కనిపించలేదు.
అంతేకాదు అఖిల్ రిసెప్షన్ లో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కానీ ఆయన ఫ్యామిలీ కానీ కనబడలేదు. నాగార్జునకు బాలయ్యకు మద్యన డిస్టెన్స్ ఉంది అనేది మీడియా టాక్. అందుకే నాగ్ ఉన్న చోట బాలయ్య ఉండరు, బాలయ్య ఉన్న చోట నాగ్ ఉండరు అంటూ ఉంటారు. మరి అఖిల్ వివాహానికి బాలయ్యను నాగ్ ఆహ్వానించారా, నాగ్ ఆహ్వానించినా బాలయ్య రాలేదా అనేది ప్రస్తుతం మిస్టరీగా కనిపిస్తుంది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.