
బోనీ కపూర్, మోనా షౌరీ కపూర్‌కు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న 90ల కాలంలో మన దేశంలో విడాకులు, విడిపోవడం లాంటివి చాలా అరుదుగా ఉండేవని అన్షులా వివరించారు. తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ అన్షులా “నేను ఒకటో క్లాస్‌లో ఉన్నాను. అప్పుడు ఏమైందంటే, మా జీవితంలో జరుగుతున్న విషయాల వల్ల కొన్ని కుటుంబాలు మాతో కలవడానికి ఇష్టపడలేదు. వాళ్ల పిల్లలు మా ఇంటికి రావడం, ఏదైనా గొడవల్లో చిక్కుకోవడం వారికి నచ్చేది కాదు. 90ల్లో స్కూల్ అయ్యాక, పిల్లలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళేవారు కదా? నాకు గుర్తుంది. నా క్లాస్మేట్స్ నా పట్ల ప్రవర్తించే విధానంలో, వాళ్ల కుటుంబాలు నా పట్ల ప్రవర్తించే విధానంలో పెద్ద మార్పు వచ్చింది. స్కూల్లో అదొక చాలా ఎమోషనల్, చాలా గందరగోళమైన సమయం.” అని వివరించారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b