
ByGanesh
Wed 11th Jun 2025 04:12 PM
అలాంటి ఘర్షణ పాపులర్ పంజాబీ ర్యాపర్లు బాద్ షా, యోయో హనీ సింగ్ నడుమ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ ఇద్దరూ ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటారు. తక్కువ చేస్తూ మాట్లాడుతారు. వెకిలిగా, వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటారు. ఇది ఇతరులకు చాలా సిల్లీగాను అనిపిస్తుంది. అయినా వారు ఏళ్లుగా వైరాన్ని వీడటం లేదు. ఇద్దరిలో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు పాపులర్ పాప్ గాయని దువా లిపాపై బాద్ షా చేసిన ఓ కామెంట్ కి స్పందిస్తూ యోయో హనీ సింగ్ చేసిన కామెంట్ మంటలు పుట్టిస్తోంది.
దువా లిపాతో మీరు ట్రాక్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఆమెతో పిల్లల్ని కనడం కంటే గొప్ప ఇంకేం ఉంటుంది? అని వ్యాఖ్యానించాడు. ఇది సోషల్ మీడియాల్లో అగ్గి రాజేసింది. ఇంతలో యోయో హనీసింగ్ కూడా సీన్ లోకి వచ్చాడు. `జీనియస్` అంటూ క్లాప్ ఈమోజీలను అతడు షేర్ చేయగానే బాద్ షా అభిమానులు భగ్గుమన్నారు. నెటిజనులు రెండుగా చీలి ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, బాద్ షా తన వ్యాఖ్యలకు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. మనం ఆరాధించే గాయని లేదా మహిళతో పిల్లల్ని కనడం అంటే, వారికి దానిని మించిన గొప్ప కానుక ఏం ఉంటుంది? అని కవర్ చేయబోయి మళ్లీ వివాదాన్ని కొనసాగించాడు. ప్రస్తుతానికి బాద్ షా నోరు జారగానే యోయో అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కానీ అతడు కూడా దొరక్కపోతారా?
Big fight between singers:
Badshah vs Yo Yo Honey Singh
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.