
ByGanesh
Wed 04th Jun 2025 11:01 PM
అభిమానం వెర్రి తలలు వేస్తె ఓ పుష్ప సంధ్య థియేటర్ ఘటన, ఓ బెంగుళూరు చిన్న స్వామి ఘటన జరుగుతుంది. గతంలో పుష్ప 2 చిత్రం రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర ఓ ఫ్యామిలీ చెల్లాచెదురు అయ్యింది. భార్య మరణం, కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రి పాలవడం అన్ని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఆతర్వాత తిరుపతి టెంపుల్ లో టికెట్ల కోసం భక్తుల తొక్కిసలాట చూసి ప్రాణాలు పోయేంత భక్తి అవసరమా అనేలాంటి సంఘటన కలకలం సృష్టించింది. ఇప్పుడు ఐపీఎల్ లో RCB కప్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్న సమయంలో బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం లో అభిమానుల తొక్కిసలాట చూసిన వారు అభిమానం ఉండొచ్చు వెర్రితలలు వేసేంత అభిమానం ఉండకూడదు అంటున్నారు.
RCB విక్టరీ సెలెబ్రేషన్స్ లో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం లో ఆ తొక్కిసలాటలో దాదాపుగా 13మంది వరకు మృతి చెందినట్లు అనుమానం. మరికొంతమంది ఈ ఘటనలో గాయపడినట్లుగా తెలుస్తుంది. అభిమాన జట్టు ఐపీఎల్ గెలిచింది. దాంతో పార్టీలు చేసుకుని సంబరాలు చేసుకోవాలి కాని, అభిమానం వెర్రితలలు వేస్తె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ అభిమానులు ఎప్పుడు మారతారో మరి.
Bengaluru Stampede:
Bengaluru Stampede: Union Minister Kumaraswamy Calls For Accountability
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.