
posted on May 30, 2025 9:30AM
ఒక వ్యక్తి పెద్దయ్యాక, తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను మరచిపోతాడు. దూషించే మాటలతో వారి హృదయాలను గాయపరుస్తుంటాడు. ఇలాంటి పాపం చేయోద్దని చెబుతున్నారు చాణక్యుడు. ఎందుకో ఈ కథనం చదువుతే మీకే అర్థం అవుతుంది.
ఆచార్య చాణక్యుడు మంచి జీవితం కోసం అనేక సూత్రాలను అందించాడు. వీటిని అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో విజయం యొక్క నిచ్చెనను సులభంగా అధిరోహించగలడు. మన జీవితంలో ఎంతమంది శత్రువులు ఉంటారో అంతమంది స్నేహితులుంటారు. మన సంతోషాన్ని, దుఃఖాన్ని తమదిగా భావిస్తూ కష్టసుఖాల్లో మనతో ఉంటారు. కొన్నిసార్లు మనల్ని నీడలా అనుసరించే మన స్నేహితులను తెలిసో తెలియకో బాధపెడతాం. దీని గురించి చాణక్యుడు చాణక్య నీతిలో కూడా చెప్పాడు. చాణక్యుడి విధానంలో ఆయనతో మనం ఎప్పుడూ గొడవ పడకూడదని, కోపం తెచ్చుకోకూడదని చెప్పాడు. వారితో పోట్లాడుకుంటే జీవితాంతం పశ్చాత్తాపంతో గడిపేస్తాం. ఎవరిని అనరాని మాటలతో తిట్టకూడదు..? ఎవరికి కోపం రాకూడదు..?
1. తల్లిదండ్రుల తప్పుగా గురించి మాట్లాడకండి:
ఆచార్య చాణక్యుడు ప్రకారం, మాటలు సంబంధాలను నాశనం చేస్తాయి. మన తల్లిదండ్రులను ఎప్పుడూ దూషించే పదాలు ఉపయోగించకూడదని చాణక్యుడు చెప్పాడు. మనల్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రులు, మంచి మాటలు మాట్లాడాలని అరిచిన వారు, మంచి నడవడిక నేర్పిన వారు.. మన భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టే తల్లిదండ్రులను దూషించే మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులను బాధపెడితే పాపులం అవుతాం. మనం చేసిన ఈ తప్పుకి క్షమాపణ అనేదే లేదు.
2. సలహా ఇవ్వకండి:
మన జీవిత పురోగతిలో తల్లిదండ్రుల స్థానం ఎక్కువగా ఉంటుంది, తల్లిదండ్రులతో ఏదైనా మాట్లాడే ముందు మన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి తప్పుగా మాట్లాడిన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా సార్లు కోపంగా ఉన్న వ్యక్తి తన యవ్వన శక్తిని తల్లిదండ్రుల వైపు చూపిస్తాడు. తన యవ్వనానికి కారణమైన వారిపై తన శక్తిని ప్రదర్శిస్తున్నట్లు మనిషి మరచిపోతాడు. అలాంటప్పుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదు.
చాణక్యుడి కథ:
గొప్ప మేధావి చాణక్యుడు తన తల్లిదండ్రులు తమ జీవితమంతా మన కోసం, మన ఆనందం కోసం అంకితం చేస్తారు . క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, కోపంతో మనం మాట్లాడే ఒక మాట వారి హృదయాలను పగిలేలా చేస్తాయి. మన పరుషమైన మాటలు వారి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తాయి. కాబట్టి, తల్లిదండ్రులను దూషించే పదాలను ఉపయోగించే ముందు, జాగ్రత్తగా ఆలోచించి, మన నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.