
స్నేహతులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మంచి డిన్నర్ ఇచ్చిన మంగ్లీ తన బర్త్ డే లో విదేశీ మద్యం, గంజాయి కూడా పంపిణి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పార్టీలో నటి దివి, కాసర్ల శ్యామ్ ఉన్నట్లుగా మీడియాలో వార్తలు రావడంతో దివి రచయిత కాసర్ల శ్యామ్ మంగ్లీ బర్త్ డే పార్టీ, అలాగే దానిపై నమోదైన కేసుపై రియాక్ట్ అయ్యారు.
కాసర్ల శ్యామ్ మట్లాడుతూ..
మంగ్లీ బర్త్ డే పార్టీకి నేను హాజరయ్యాను, బర్త్ డే పార్టీలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేవరకు నేను ఉన్నాను, పార్టీకి హాజరైన నేను, సెలబ్రేషన్స్ తర్వాత వచ్చేశాను, డ్రగ్స్ విషయం గురించి నాకు తెలియదు.. అలాంటి వాటికి నేను దూరం, నాకు డ్రగ్స్ అలవాటు లేదు, అనవసరంగా నాపేరుపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు అని కోరారు.
ఇక దివి ఓ ఆడియో ని రిలీజ్ చేసింది. సింగర్ మంగ్లీ మంచి ఫ్రెండ్, ఆమె మంచి అమ్మాయి, అందుకే బర్త్ డే కి పిలిస్తే వెళ్ళాను, నేను ఏ డ్రగ్స్ తీసుకోలేదు, నాపేరు, నా ఫోటో వేసి నన్ను బ్యాడ్ చెయ్యకండి. మీరు కూడా మీ ఫ్రెండ్ బర్త్ డే కి పిలిస్తే వెళతారు కదా, నేను అలాగే వెళ్ళాను, అందులో తప్పేముంది, అక్కడ జరిగిన దానికి నాకు సంబంధం లేదు అంటూ దివి మంగ్లీ బర్త్ డే పార్టీ అలాగే ఆ కేసు పై రియాక్ట్ అయ్యింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.