
ByGanesh
Fri 06th Jun 2025 08:56 PM
శంకర్ గేమ్ చేంజర్ అవుట్ డేటెడ్ స్క్రిప్ట్ తో తెరకెక్కించి చరణ్ కి డిజాస్టర్ ని మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి మరో టెన్షన్ పెద్ది విషయంలో స్టార్ట్ అయ్యింది. పెద్ది చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు, అందులో ఆందోళన పడాల్సిన పనేముంది అనుకుంటున్నారు.
కానీ బుచ్చిబాబు-రామ్ చరణ్ పెద్ది చిత్రానికి ఏరికోరి ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తెచ్చుకున్నారు. ఇప్పుడు రెహమాన్ నుంచి వచ్చిన థగ్ లైఫ్ విషయంలో రెహమాన్ మ్యూజిక్ కానీ, BGM కి కానీ పాజిటివ్ టాక్ రాకపోగా.. బోలెడన్ని విమర్శలొచ్చాయి. దానితో రెహమాన్ చరణ్ పెద్ది చిత్రాన్ని ఏం చేస్తారో అనే ఆందోళనలోకి మెగా ఫ్యాన్స్ వెళ్లిపోతున్నారు.
మరి మెగా ఫ్యాన్స్ కి అప్పుడు శంకర్ కునుకు లేకుండా చేస్తే.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కునుకులేకుండా చేస్తున్నారన్నమాట.
Mega fans in panic mdoe:
Game Changer vs Peddi
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.