
ByGanesh
Wed 04th Jun 2025 03:11 PM
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరి హర వీరమల్లు విడుదల జూన్ 12 న ఉంటుందా, అసలు హరి హర వీరమల్లు చుట్టూ ఏమవుతుంది. వీరమల్లు కు ఆర్ధిక కష్టాలు అంటూ ప్రచారం జరగడమేనా.. నిజం అదే కదా.. నాలుగేళ్లకు పైగా సెట్ పై ఉన్న వీరమల్లు ఇన్నాళ్ళకి మోక్షమా పొంది విడుదలకు సిద్ధమైంది. పాత స్క్రిప్ట్ కి బూజు దులిపారేమో అనే సందేహంతో వీరమల్లు ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఏ ఏం రత్నం కాబట్టి హరి హర వీరమల్లు ను ఒడ్డుకు చేర్చారు, మరో నిర్మాత అయితే వీరమల్లుని ఎప్పుడో వదిలేసేవారు, పవన్ కళ్యాణ్ క్రేజ్ తో హరి హర వీరమల్లు ను భారీ ధరలకు విక్రయించాలని నిర్మాత అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. హరి హర వీరమల్లుకు నిర్మాత వేసిన కోటిషన్ కి కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.
మరోపక్క ఏ ఏం రత్నం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడంతో పవన్ కళ్యాణ్ తన పారితోషికం నుంచి 11 కోట్లు వెనక్కి ఇచ్చారనే న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది. సినిమాని ఎలాంటి ప్రెజర్ లేకుండా విడుదల చేసుకోవాలని రత్నం కి పవన్ చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇవన్నీ చూసి అసలు హరి హర వీరమల్లు చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాక పవన్ ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు.
What happened to Hari Hara Veera Mallu:
What Is Happening with Hari Hara Veeramallu
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.