
ByGanesh
Tue 10th Jun 2025 09:53 AM
దానితో శంకర్ ఇండియన్ 3 పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది అంటూ శంకర్ చెబుతున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన థగ్ లైఫ్ చూసాక ఇండియన్ 3 థియేటర్స్ లో విడుదల చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలను కమల్ అభిమానులే వ్యక్తం చెయ్యడం గమనార్హం.
ఒకవేళ థగ్ లైఫ్ హిట్ అయినా, లేదంటే ఫలితం సానుకూలంగా ఉండి ఉంటే, ఇండియన్ 3 ని ఏ దీపావళికో లేదా దసరా సీజన్లో విడుదల చేసే అవకాశం ఉండేది. కానీ థగ్ లైఫ్ రిజల్ట్ చూసాక ఇండియన్ 3 పూర్తిగా హోల్డ్‌లో పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మరోపక్క ఇండియన్ 3 ని థియేటర్స్ లో విడుదల చెయ్యొద్దనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
వరసగా శంకర్ నిరాశ పరిచే సినిమాలు చెయ్యడం, అటు కమల్ కి కూడా విక్రమ్ తర్వాత హిట్ లేకపోవడంతో ఇండియన్ 3 ని థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేసే ఏర్పాట్లు చేస్తే బావుంటుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.
Public Opinion: Indian 3 Will Be No Different:
Indian 3 rumors
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.