
తర్వాత కొన్నాళ్ళు సౌమ్య రాయ్, కొన్నాళ్ళు సిరి ఒక వారానికి యాంకర్స్ గా కనిపించినా రష్మీ మాత్రం ఎప్పుడు జబర్దస్త్ నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఎంతమంది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయినా రష్మీ మాత్రం వదలకుండా జబర్దస్త్ ని పట్టుకునే ఉంది. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో రష్మీ తో పాటుగా మరో మేల్ యాంకర్ వస్తున్నట్లుగా క్లూ ఇచ్చారు.
జబర్దస్త్ లో ఇకపై అంతా కొత్త కంటెంట్, మరింత కిక్కిచ్చే కామెడీ ఉంటుందని లేటెస్ట్ గా వదిలిన టీజర్ తో హైప్ క్రియేట్ చేసారు. రీలోడెడ్ వెర్షన్ లో ఎర్జరీ డబుల్, ఎంటర్ టైన్ మెంట్ డబుల్, ఎవర్రీ థింగ్ డబుల్ ఉంటుందని జెడ్జి కుష్బూ చెప్పారు. ఇప్పటి వరకు ఆడియెన్స్ లో జబర్దస్ ఉందని, ఇకపై జబర్దస్త్ లో ఆడియెన్స్ ఉంటారని మరో జడ్జీ కృష్ణ భగవాన్ చెప్పారు.
అంతేకాదు అన్ని డబుల్ ఉన్నట్టుగా యాంకర్ కూడా డబుల్ ఉంటారని ఖుష్బూ చెప్పారు. జబర్దస్త్ న్యూ చాప్టర్ వెర్షన్ లో మేల్ యాంకర్ ఎవరనేది మాత్రం టీజర్ లో చూపించ లేదు. కానీ హింట్ ఇచ్చారు. ఆ స్టైల్, నడకతీరు, కళ్లజోడు పెట్టే విధానంతో సుడిగాలి సుధీర్ అని తెలుస్తోంది. రష్మీ-సుధీర్ ల జోడి బుల్లితెరపై ఎంతగా పాపులర్ అయ్యిందో తెలుసుగా, మరి ఈ ఇద్దరూ జబర్దస్త్ స్టేజ్ పై చేసే రొమాన్స్ తో జబర్దస్త్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.