
ByGanesh
Sun 22nd Jun 2025 08:52 PM
అయితే ఈరోజు జూన్ 22 తలపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా జన నాయకుడు టీజర్ విడుదల చేశారు. అందులో విజయ్ పోలీస్ గా, అలాగే కుర్చీలో కూర్చున్న సీన్ చూస్తే భగవంత్ కేసరిలోని బాలకృష్ణ ని మక్కీకి మక్కీ దించేశారు అనిపించేలా ఉంది. విజయ్ ఖాకీ డ్రెస్ లుక్ చూస్తుంటే భగవంత్ కేసరిలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్ గుర్తుకు రావడం సహజం. దానితో జన నాయగన్ భగవంత్ కేసరికి రీమేకనే సందేహాలు మరింత బలపడ్డాయి.
అలాగే కత్తి తిప్పుతూ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత విజయ్ కుర్చీలో కూర్చున్న లుక్ అంతా బాలయ్య ను పోలి ఉంది, ఇది రీమేక్ కాదంటే ఎవరు ఒప్పుకోరు అంటూ నందమూరి అభిమానులు మరోసారి జన నాయగన్ పై రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో భగవంత్ కేసరి-జన నాయగన్ పోస్టర్స్ పక్క పక్కన పెట్టి మరీ చూడండి అంటూ చూపిస్తున్నారు.
Jana Nayagan First Roar out for Vijay birthday:
Jana Nayagan—reportedly a remake of Bhagavanth Kesari
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.