
ByGanesh
Mon 30th Jun 2025 12:06 PM
మూడు రోజుల క్రితమే విడుదలైన కన్నప్ప చిత్రం ఇప్పుడు పైరసీ బారిన పడింది. ఈ చిత్రానికి సంబంధించిన వేలాది పైరసీ లింకులు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కన్నప్ప పైరసీ బారిన పడడంతో కన్నప్ప టీమ్ షాకయ్యింది. అంతేకాదు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రియాక్ట్ అయ్యారు.
కన్నప్ప పైరసీ లింక్స్ ని చాలా తొలగించాము అని, మా కన్నప్ప సినిమా పైరసీ గురయ్యింది. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇప్పటికే 30,000 పైచిలుకు పైరసీ లింకులను తొలగించాం. పైరసీ అనేది ముమ్మాటికీ దొంగతనమే. పైరసీ కంటెంట్ చూడటం అంటే మన పిల్లలకు దొంగతనం నేర్పించడమే. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి. సరైన మార్గంలో సినిమాకు మద్దతు ఇవ్వండి.. అంటూ మంచు విష్ణు కన్నప్ప పైరసీ పై పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
Kannappa Piracy – Manchu Vishnu Heartbreaking Post:
Piracy threat for Vishnu Manchu Kannappa
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.