
ByGanesh
Wed 04th Jun 2025 11:49 AM
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం ఎనోసార్లు వాయిదా పడి చివరికి జూన్ 27 న విడుదలకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. దానికి అనుగుణంగానే మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు కన్నప్ప అన్నిసార్లు వాయిదా పడడానికి కారణం అనుభవం లేని వ్యక్తికి కన్నప్ప విఎఫెక్స్ పనులు అప్పజెప్పడంతో కన్నప్ప ను సకాలంలో పూర్తి చేసి విడుదల చేయలేకపోయామని మంచు విష్ణు రీసెంట్ గా ఓ సందర్భంలో చెప్పారు.
ఈమధ్యన కన్నప్ప హార్డ్ డ్రైవ్ తస్కరించబడడం హాట్ టాపిక్ అయ్యింది. మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డ్రైవ్ దొంగతనం వెనుక మంచు మనోజ్ ఉన్నాడని ఆరోపించారు. ఆతర్వాత కన్నప్పను ప్రమోట్ చేస్తూ బిజీగా వున్న సమయంలో కన్నప్ప మళ్లీ వాయిదా పడనుంది అనే వార్తలు వైరల్ గా మారాయి.
కన్నప్ప వాయిదా వార్తలపై మంచు విష్ణు స్పందిస్తూ.. కన్నప్ప సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న థియేటర్లలోకి వస్తుందని, అసలు వాయిదా వేసే ఆలోచనే తమకు లేదని, ఆల్రెడీ తాను రెండు తెలుగు స్టేట్స్ లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ ను కూడా ప్లాన్ చేసుకున్నానని, ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడదని మంచు విష్ణు భరోసా ఇచ్చారు.
Will Kannappa Get postponed:
Kannappa postponed rumours – Manchu Vishnu clarity
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.