
ByGanesh
Fri 27th Jun 2025 08:55 AM
కన్నప్ప ఓవర్సీస్ రివ్యూలోకి వెళితే.. శివ భగవానుడు పరమ భక్తుడి డ్రామాగా రూపొందిన హిస్టరికల్ యాక్షన్ ఫిల్మ్ కన్నప్ప. మంచు విష్ణు తిన్నడు పాత్రలో తన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆ క్యారెక్టర్లో జీవించారు. గెస్ట్ రోల్ చేసిన ప్రభాస్ ఎంట్రీ అయితే రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇక మలయాళ స్టార్ మోహన్‌లాల్ క్యారెక్టర్ పెద్ద సర్ప్రైజ్. బీజీఎం, క్లైమాక్స్‌లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి.. అంటూ ఒక ఆడియెన్ కామెంట్ చేసారు.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే.. ప్రభాస్ కేమియో అదిరిపోయింది. ప్రభాస్ కోసం కన్నప్ప ను చూసేయ్యొచ్చు.. అంటూ మాట్లాడుతున్నారు. కన్నప్ప సినిమా క్లైమాక్స్‌లో విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. మోహన్ బాబు పాత్ర బాగుంది.. అంటూ మరో ప్రేక్షకుడు కన్నప్ప పై స్పందించాడు.
మోహన్ బాబు ప్రభాస్ పాత్రలు కన్నప్ప లో హైలెట్. విష్ణు మంచు డీసెంట్ ఫెర్పార్మెన్స్ చేశాడు. గ్రాఫిక్ వర్క్ బాగాలేదు. గ్రీన్ మ్యాట్ షూట్ విషయంలో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ బాగాలేదు. ఫైట్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ అంతగా బాగాలేదు.. అంటూ మరికొందరు కన్నప్ప చిత్రం పై స్పందిస్తున్నారు.. మరి కన్నప్ప అసలు కథ ఏమిటి అనేది కాసేపట్లో రాబోయే రివ్యూలో చూసేద్దాం.
Kannappa Overseas Review:
Kannappa social media talk
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.