
మంచు హీరోలు కెరీర్ పై ఫోకస్ కన్నా ఎక్కువగా ఆస్తులపై, లేదంటే ఇతర విషయాలపై ఫోకస్ చేసి రోడ్డెక్కుతున్నారు, అసలు ప్రొఫెషనల్ లైఫ్ ని సరిదిద్దుకోవాలనే ఆలోచన వారిలో ఉందొ, లేదో తెలియడం లేదు.. తోమిదేళ్లుగా సినిమాల్లో కనబడని మంచు మనోజ్, కొన్నేళ్లుగా తెరకు దూరమైన మంచు విష్ణు ఒకేసారి ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
గత ఏడాది కాలంగా ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ పనులపై గొడవలపై ఫోకస్ పెట్టిన మంచు అన్నదమ్ముల్లో మంచు మనోజ్ భైరవంతో పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. గజపతి వర్మ గా మంచు మనోజ్ భైరవం చిత్రంలో పెరఫార్మెన్స్ పరంగా అద్దరగొట్టేసాడు. మంచు మనోజ్ పాత్రకు స్పెషల్ రివ్యూస్ వస్తున్నాయి.
మంచు మనోజ్ లుక్, అలాగే అతని కేరెక్టర్ అన్ని ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. భైరవం చిత్రం రిజల్ట్ లో మేజర్ క్రెడిట్ మంచు మనోజ్ కి వెళుతుంది. భైరవంతో మనోజ్ పెర్ఫెక్ కమ్ బ్యాక్ అయ్యాడు.
మరి మంచు విష్ణు ఏం చేస్తాడో.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈనెల 27 అంటే జూన్ 27 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ భాగమయ్యారు. కన్నప్ప పదే పదే వాయిదాలు పడి చివరికి ఈ నెల 27న రిలీజ్ కి రెడీ అయ్యింది.
మరి కన్నప్ప తో మంచు విష్ణు కూడా కమ్ బ్యాక్ అవుతాడా, లేదా.. అంటూ కామెంట్ చెయ్యడమే కాదు, తమ్ముడు కొట్టాడు హిట్టు-అన్న కొడతాడా హిట్టు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.