
మూడో వ్యక్తి వలనే తమకు విడాకులయ్యాయంటూ ఆర్తి సోషల్ మీడియా వేదికగా కేనీషా పై ఇండైరెక్ట్ గా సెన్సేషనల్ కామెంట్లు పెట్టింది, అంతేకాదు జయం రవి నుంచి భరణం కింద నెలకు 40 లక్షలు డిమాండ్ చేసింది ఆర్తి. ఆ తర్వాత జయం రవి కేనీషా తో కలిసి కనిపించడంపై సోషల్ మీడియాలో కేనీషా పై అసభ్యకర ట్రోలింగ్ మొదలైంది. దానితో ఆమె పీఆర్ టీం కేనీషా పై ట్రోల్ చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్ఛరించింది.
ఆతర్వాత జయం రవి-కేనీషా వివాహం చేసుకున్నారంటూ పూల దండలు వేసుకున్న ఫోటో వైరలయ్యింది. అది టెంపుల్ లో పూజ చేసిన సందర్భంలో దండలు వేసుకున్నట్టుగా, వారికి పెళ్లి కాలేదు అంటూ సమాచారం రావడంతో అందరూ రిలాక్స్ అయ్యారు.
తాజాగా కేనీషా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దానితో కేనీషా తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది, నేను గర్భవతిని కాను, ఎవరేం చెప్పినా, మాట్లాడినా అది వారి ఖర్మ అనుభవిస్తారు. నిజం, అబద్దం ఏమిటి అనేది త్వరలోనే తెలుస్తాయి అంటూ కేనీషా చెప్పుకొచ్చింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.