
ByGanesh
Mon 30th Jun 2025 03:53 PM
అయితే అది ఎప్పటివరకు, అసలు ఎప్పుడు సినిమాని రిలీజ్ చేస్తారనే విషయంలో విజయ్ దేవరకొండ అభిమానులు నిర్మాత నాగవంశీ పై ఫైర్ అవుతున్నారు. నాగవంశీ కింగ్ డమ్ విషయాలు వదిలేసి వేరే సినిమాల విషయాలను మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాగవంశీ కింగ్ డమ్ అభిమానులకు క్రేజీ హామీ చ్చారు.
నన్ను నమ్మండి.. ఈ సినిమాతో మీకు ఫుల్ మీల్సే అంటూ చెప్పిన నాగవంశీ ఏం పోస్ట్ చేసినా కింగ్డమ్ మీద మాత్రం తీయటి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు, కానీ నన్ను నమ్మండి. ఒక భారీ బిగ్ స్క్రీన్ అనుభవాన్ని ఇవ్వడానికి మా చిత్ర బృందం రేయింబవళ్లు కష్టపడుతోంది.
ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా చూసినపుడు వచ్చే అడ్రెనలిన్ రష్ నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఎంతో నమ్మితే కానీ నేను ఏదీ చెప్పను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా మీ క్రియేటివిటీ అంతా చూపిస్తారు నా మీద. సినిమా చూశాక చెబుతున్నా.. కింగ్డమ్ ఒక విన్నర్. ఇది ఫుల్ మీల్స్ కమర్షియల్ ఎంటర్టైనర్. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, పాట అనౌన్స్మెంట్తో కలుద్దాం అంటూ నాగవంశీ సోషల్ మీడియా వేదికగా కింగ్ డమ్ పై చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.
Nagavamsi about Kingdom release:
Kingdom Release: Naga Vamsi has a Clear Update
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.