
ByGanesh
Wed 11th Jun 2025 10:32 AM
అయితే కోట ఇటీవల వృద్ధాప్య సంబంధ సమస్యల్ని ఎదుర్కొంటున్నారని తాజాగా బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటో చెబుతోంది. ఇటీవల కోటను ఆయన ఇంట్లో సందర్శించిన గణేష్ .. చాలా కాలం తర్వాత ఇలా కోట బాబాయ్‌ను కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అయితే గణేష్ ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసిన వెంటనే కోట అభిమానులు దానిని వైరల్ చేస్తూ ఆందోళనను వ్యక్తపరిచారు. వెటరన్ నటుడు బాగా బక్క చిక్కి శల్యమై కనిపించారు. ఆయన రంగు రూపం మారిపోయింది.
పైగా కాలికి కట్టు కనిపించింది. మరో కాలు బొబ్బలు తేలి కనిపించింది. అయితే వయసు 70 పైబడిన ఆయన సుగర్ బాధితుడు. దాంతో పాటే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం విశ్రాంత జీవితంలో తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం ఇబ్బందికరం. ఆయనకు ఏమైందో అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Fans Concerned Over Kota Srinivasa Rao Health:
Kota Srinivasa Rao has not been in front of the camera for a long time
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.