
ఇక జూన్ స్టార్ట్ అవడమే థగ్ లైఫ్ లాంటి భారీ చిత్రంతో మొదలైనా.. ఆ చిత్రం బాక్సాఫీసుని, ప్రేక్షకులను అన్ని భాషల్లో డిజప్పాయింట్ చేసింది. గత ఐదు నెలలుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసు కు మళ్లీ జీవం పోసింది ధనుష్-నాగ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
అంతేకాదు ఓపెనింగ్స్ డల్ గా ఉన్నప్పటికి.. కుబేర కొచ్చిన పాజిటివ్ వైబ్స్ తో బుకింగ్స్ జోరుగా స్టార్ట్ ఆయాయ్యి. శుక్రవారం కాస్త నెమ్మదిగా మొదలైన కుబేర బుకింగ్స్ శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ కూడా ఫుల్ అయ్యాయంటే.. బాక్సాఫీసుకి కుబేర శుభారంభం అనేలా ఉంది. బాక్సాఫీసుకి నిజంగా కుబేర ఊరటచ్చింది.
కుబేర కొస్తున్న పాజిటివ్ టాక్, రివ్యూస్ అన్ని సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడమైతే గ్యారెంటీగా కనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత రిలాక్స్డ్ గా థియేటర్స్ లో కూర్చుని కుబేరను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.