
ByGanesh
Mon 02nd Jun 2025 09:04 PM
ఒకప్పుడు నారా లోకేష్ ని కించపరిచే విధంగా మాట్లాడిన రాజకీయనాయకులు ఈరోజు లోకేష్ ఎదుగుదలను చూసి అప్రిశేట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లోకేష్ కు మంచి పేరుని తీసుకురావడమే కాదు, ఆయన రాజకీయాల్లో రాటుతేలేందుకు ఆ పాదయాత్ర చాలా దోహదపడింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వలన అన్యాయం చేయబడిన ప్రజలను, జగన్ ప్రభుత్వంలో మోసపోయిన యువతకు భరోసా ఇవ్వడమే కాదు, టీడీపీ కార్యకర్తలను జగన్ ప్రభుత్వం వైసీపీ నేతలు ఏ విధంగా వేధించారో, అలాగే టీడీపీ నేతలను ఏ విధంగా అన్యాయంగా జైలుకు పంపి ఇబ్బందులు పాలు చేసారో వారందరి పేర్లను లోకేష్ రెడ్ బుక్ లో రాయమని చెప్పి కార్యకర్తలకు అండగా నిలిచారు.
లోకేష్ రెడ్ బుక్ చూసి జగన్ ఆయన చెంచాలు ఎంతగా భయపడ్డారో అందరూ చూసారు. అనవసరంగా టీడీపీ కార్యకర్తలను, నేతలను వేధించిన పాపం ఊరికే పోదు, అందుకే లోకేష్ రెడ్ బుక్ పేరు వినగానే వణికిపోయారు. అదే ట్రెండ్ తెలంగాణలోనూ మొదలయ్యింది బీఆర్ఎస్ నేత హారిష్ రావు కూడా రెడ్ బుక్ అంటూ చేసిన కామెంట్స్ చూసి హరీష్ రావు లాంటి నాయకుడే లోకేష్ ని ఫాలో అవుతున్నాడు అంటే లోకేష్ రేంజ్ ఇది కదా అంటూ టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్నాయని, ఇష్టం వచ్చినట్టుగా కేసులు నమోదు చేస్తుండటంతో వారి పేర్లు రెడ్ బుక్ లో రాసుకోండి అంటూ లోకేష్ డైలాగ్ ను వినిపించారు హరీష్ రావు. మరి లోకేష్ రెడ్ బుక్.. రాజకీయాల్లో ఎంతగా పాపులర్ అయ్యిందో దీన్ని బట్టి ఇట్టే అర్ధమవుతుంది.
Harish Rao Red Book Warning:
Harish Rao about Red Book
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.