
ByGanesh
Sun 06th Jul 2025 08:03 PM
ఇతర హీరోల అభిమానులా మేకర్స్ ని దుమ్మెత్తిపోయ్యలేరు. మహేష్-ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ ఇలా క్రేజి నటులతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై పాన్ ఇండియా లో భీభత్సమైన అంచనాలున్నాయి. మార్చ్ లో SSMB 29 సెట్ నుంచి మహేష్ వీడియో ఒకటి లీకై సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి నో హడావిడి.
మరి మహేష్ అభిమానులు ఇంకెంత కాలం ఎదురు చూడాలి, మహేష్ SSMB 29 పై అప్ డేట్ వచ్చే సమయం ఆసన్నమైంది. అది ఆగష్టు 9 మహేష్ బర్త్ డే రోజున. మహేష్ రాజమౌళి పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ సర్ ప్రైజ్ అయ్యేలా ట్రీట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అది కూడా ఓ వీడియో కట్ తో ఆ ట్రీట్ ఉండబోతుంది అంటున్నారు.
మహేష్ అభిమానులను వెయిట్ చేయిస్తే చేయించారు కానీ.. వాళ్లకు సంబరాలు చేసుకోవడానికి అదిరిపోయే ఫుల్ మీల్స్ మాత్రం రాబోతుంది అని టాక్.
Mahesh Babu fans waiting for that big birthday surprise:
Will Mahesh Babu Drop SSMB29 Glimpse on His Birthday
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.