
వీటన్నిటిని మించి అతి ముఖ్యమైన కన్నప్ప కథను తెర పైకి తీసుకురావాలి అనే విష్ణు సంకల్పానికి మోహన్ బాబు చేసిన అతి పెద్ద ఉపకారం ఏమిటంటే ఈ చిత్రానికి సరైన దర్శకుడిని సూచించడం. కన్నప్ప వంటి చారిత్రక కథని తీసేందుకు స్వతహాగా అయితే మన తెలుగు దర్శకుల్లోనే ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. బహుశా చిరంజీవి తో సైరా తీసిన సురేందర్ రెడ్డిని కానీ, బాలకృష్ణ తో శాతకర్ణి తీసిన క్రిష్ ను కానీ, నాగార్జున తో రాజన్న తెరకెక్కించిన విజయేంద్ర ప్రసాద్ ని కానీ పరిగణనలోకి తీసుకోవచ్చు, పరిశీలించవచ్చు, కానీ మహాభారతం వంటి టీవీ సీరియల్ తీసిన దర్శకుడిని ఏరి కోరి ఎంచుకుని విష్ణు కి ఆ పేరు సజెస్ట్ చేసారు మోహన్ బాబు.
దేశమంతా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ఆ దర్శకుడు కన్నప్ప కథపై గట్టిగానే కసరత్తు చేసారు. తనకున్న అనుభవాన్ని అంతా రంగరించి కన్నప్ప కథను రక్తికట్టించారు. ప్రథమార్ధం మరీ కమర్షియల్ గా ఉందనే విమర్శలు వస్తున్నప్పటికీ నేటి తరానికి కన్నప్ప కథను చెప్పాలంటే వారిని ఆకర్షించే అంశాలు ఉండాలనే ఉద్దేశ్యమేమో.. విష్ణు కి దర్శకుడికి. అందుకే ఆయా అంశాలన్నిటినీ రంగరించి తిన్నడు కథను కన్నప్ప కథగా మలుపు తీసుకునే సమయం వరకు కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. కానీ ఒక్కసారి తిన్నడు శివభక్తునిగా మారే క్షణం సినిమాలో స్పష్టముగా మార్పుని చూపించింది.
కిరాతుడిగా మోహన్ లాల్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు, రుద్ర పాత్రలో ప్రభాస్ ఒక్కొక్కరూ ఒక్కో బీజం వేసుకుంటూ వెళ్లిపోగా.. కన్నప్ప గా రూపాంతరం చెందే క్రమంలో విష్ణు విశ్వరూపం చూపించేసాడు, ఇతనిలో ఇంతటి నటుడున్నాడా, ఇతనిలో ఇంతటి అభినయ సామర్థ్యం ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా అభినయించాడు విష్ణు. ఏ ప్రేక్షకుడిని కదిపినా ఆఖరి అరగంట అద్భుతం అంటున్నారంటే ఆ క్రెడిట్ పూర్తిగా హీరోకి, దర్శకుడికే చెందుతుంది. వారిద్దరి మధ్య సమన్వయం సరిగ్గా కుదరబట్టే ఆ అద్భుతం సాధ్యమైంది. అయితే ఈ అద్భుతం వెనుక నిజంగా క్రెడిట్ ఇవ్వాల్సింది, హ్యాట్సాఫ్ చెప్పాల్సింది మోహన్ బాబు కే. ఆయన జెడ్జిమెంట్, ఆయన డెసిషన్ కరెక్ట్ అని కలెక్షన్స్ సాక్షిగా ప్రూవ్ చేస్తుంది కన్నప్ప.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.