
ByGanesh
Tue 10th Jun 2025 09:45 PM
మరోవైపు మోహన్ లాల్ తన ఆర్జనను తెలివైన మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో లాల్ తన పోర్ట్ ఫోలియోని విస్తరిస్తున్నారు. తాజా సమాచారం మేరకు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలోని 29వ అంతస్తులో మోహన్‌లాల్ 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక విలాసవంతమైన ఒక బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసారు.
దీని ధర దాదాపు రూ. 35 మిలియన్లు (సుమారు 2.8 మిలియన్ దిర్హామ్‌లు) ఉంటుందని అంచనా. ఈ అపార్ట్ మెంట్ అతని భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరు మీద రిజిస్టర్ చేసి ఉంది. తన సినిమాల షూటింగుల కోసం రెగ్యులర్ గా దుబాయ్ విజిట్ చేస్తున్న మోహన్ లాల్ కి ఈ అపార్ట్ మెంట్ సౌకర్యాన్ని అందించనుంది. దీనితో పాటు అతడి కుటుంబానికి దుబాయ్‌లోని అరేబియన్ రాంచెస్‌లో ఒక విల్లా, దుబాయ్- పిఆర్ హైట్స్ రెసిడెన్స్‌లో 3 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని అంచనా.
Star hero has assets worth 100 crore in Dubai:
Mohanlal Buy Apartment in Burj Khalifa Dubai
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.