
నిహారిక మొదటి పెళ్లి విషయంలో మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, మేము చూపించితిన అబ్బాయిని ఓకే చేసింది, అందులో తనిష్టం ఏమి లేదు, మేము ఇద్దరి విషయంలో ప్రోపర్ గా జెడ్జి చేయలేకపోయాము. ఇద్దరికీ సెట్ అవ్వలేదు, విడిపోయారు. తాను విడిపోతాము అంది, నేను ఓకే అన్నాను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేను పిల్లల జీవితాల్లో కలుగజేసుకోను.
ప్రస్తుతం తాను నిర్మాతగా సినిమాలు స్టార్ట్ చేసింది. ఎప్పుడోకప్పుడు తను ఓ అబ్బాయిని కలుస్తుంది. తన జీవితంలోకి అతన్ని ఆహ్వానిస్తుంది. పెళ్లి చేసుకుని సెటిలవుతుంది అంటూ నాగబాబు నిహారిక రెండో పెళ్లి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అంతేకాదు చైతన్య తో వివాహం విషయంలోనూ నాగబాబు సంచలనంగా మట్లాడారు.
పెద్ద వారిగా నిహారికకు మంచి జరుగుతుంది అని మేము అబ్బాయిని చూపించాము, మా కోసం ఓకే అంది, అంతేకాని అది తన స్వంత ఇష్టం కాదు. అబ్బాయి, అమ్మాయి పెళ్లితో కలిసుండాలని కోరుకుంటాము. కలిసి ఉండలేకపోతే మనం ఏం చెయ్యగలం. కలిసి ఉండాలా, లేదా అనేది వారి డెసిషన్. కానీ నేనెప్పుడూ వారి మధ్యన సిమెంట్ వెయ్యాలనుకోలేదు, అలాగని అగ్గి వెలిగించలేదు అంటూ నిహారిక-చైతన్యల నడుమ విడాకుల విషయంలో నాగబాబు ఓపెన్ అయ్యాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.