
ByGanesh
Fri 20th Jun 2025 10:10 AM
ప్రతినిధి 2 లో తనతో పాటు నటించిన సిరి లెల్లా ను ప్రేమించి, నిశ్చితార్ధం చేసుకున్న నారా రోహిత్ కి తండ్రి మరణం విషాదాన్ని నింపింది. తండ్రి చనిపోయిన ఏడాది మాసికం పూర్తయ్యాకే నారా రోహిత్ వివాహం చేసుకోవాల్సి ఉంది. అది ఆక్టోబర్ కి పూర్తి కావడంతో సిరి ని అక్టోబర్ లో వివాహం చేసుకోబోతున్నట్టుగా నారా రోహిత్ భైరవం ప్రమోషన్స్ లోనే రివీల్ చేసాడు. సిరి ఆలోచనలు, తన ఆలోచనలు దగ్గరా ఉండబట్టే ప్రేమ కలిగింది, ప్రేమ ఎప్పుడు పుడుతుందో అనేది ఎవ్వరూ చెప్పలేరు అంటూ నారా రోహిత్ తన ప్రేమ పెళ్లిపై కామెంట్స్ చేసాడు.
తాజాగా కాబోయే భార్య సిరి లెల్లా తో కలిసి నారా రోహిత్ విదేశీ ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ సిరి తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించడమే కాదు ఆ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
Nara Rohith enjoying vacation with his fiance:
Actor Nara Rohith enjoying vacation with his fiance Siri Lella
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.