
వేణు స్వామి అంటే తెలియని తెలుగు రాష్ట ప్రజలు ఉండరు. ప్రభాస్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీపై వేణు స్వామి చేసిన కామెంట్స్ ఆయన్ని కోర్టు మెట్లు ఎక్కేలా చేసాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు సెలబ్రిటీస్ జాతకాలను చెప్పుకునే వేణు స్వామి తను చెప్పింది జరుగుతుంది అంటారు.
ఇక హీరోయిన్ చాలామంది వేణు స్వామి తో పూజలు చేయించుకుంటే ఫేమస్ అవుతాము, సక్సెస్ అవుతామనుకుని ఆయనతో స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. గతంలో రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయ్యాతి లాంటి వారు వేణు స్వామితో పూజలు చేయించుకోగా. రశ్మిక టాప్ హీరోయిన్ గా సక్సెస్ అవడంతో ఇప్పడు మరో హీరోయిన్ వేణు స్వామి నే నమ్ముకుంది.
ఆమె రాజా సాబ్, హరి హర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్. గతంలోనూ నిధి వేణు స్వామితో పూజలు చేయించుకుంది. మరోమారు ఆమె వేణు స్వామి తో తన ఇంట్లో స్పెషల్ పూజలు చేయించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేణు స్వామి ఆమెతో పూజలు చేయించి దిష్టి తీయడం ఆ వీడియో లో హైలెట్ అయ్యింది.
వీరమల్లు హిట్ అయితే తనకు భవిష్యత్తు. అందుకే ఆ సినిమా హిట్ అవ్వాలని నిధి ఇలా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది, ఆమె కెరీర్ సజావుగా సాగడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నిధి ఈ పూజలు చేయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.