
ప్రభాస్ దానకర్ణుడు, ఎడమ చేతికి తెలియకుండా సహాయపడే గుణం ఆయనది, ఈ విషయంలో ఎలాంటి అబద్దం లేదు. కానీ ఫిష్ వెంకట్ కి ప్రభాస్ సహాయం విషయంలో అంతా పచ్చి అబద్దమంటూ ఫిష్ వెంకట్ కుమార్తె ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయిన విషయం తెలిసిందే.
రెండు కిడ్నీలు పాడై పోయిన ఫిష్ వెంకట్ కి ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫిష్ వెంకట్ ని కొంతమంది ఆదుకున్నా అతనికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరగాల్సి ఉంది. కానీ అంత డబ్బుని ఫిష్ వెంకట్ ఫ్యామిలీ స్పెండ్ చేయలేనిస్థితిలో ఉండడంతో, ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ తన టీం ద్వారా సహాయం అందించేందుకు ముందుకు వచ్చారనే వార్త వైరల్ అయ్యింది.
ఫిష్ వెంకట్ కుమార్తె ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పిఏ పోన్ చేసారు. కిడ్నీ డోనర్ దొరికితే ఆపరేషన్ కి అయ్యే ఖర్చు ప్రభాస్ భరిస్తా అన్నారు అని చెప్పడంతో, ప్రభాస్ మంచి మనసును అందరూ మెచ్చేసుకున్నారు. కట్ చేస్తే ప్రభాస్ సహాయం చేస్తాను అని ఏ పిఎ తో చెప్పించలేదట.
యాక్టర్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కూతురు తాజాగా చెబుతుంది. ప్రభాస్ పీఏ అని ఒకరు కాల్ చేశారు. వివరాలు తెలుసుకొని సాయం చేస్తా అన్నారు కానీ, ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. తమకు వచ్చిన నెంబర్ కు కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఫేక్ కాల్స్ తో కాలయాపన చేసే సమయం కాదని, వాళ్ల తండ్రి ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకి క్షిణిస్తుందని, సాయం చేసేవాళ్లు ఎవరైనా సాయం చేయండి అంటూ వేడుకున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.