
ByGanesh
Mon 09th Jun 2025 04:33 PM
ఏ వేదికపై అయినా ప్రభాస్ ని పొగుడుతున్నారు. మోహన్ బాబు దగ్గరనుంచి మంచు విష్ణు వరకు ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు అభిమానులకు చేరుతున్నాయి. ప్రభాస్ సింగిల్ పైసా తీసుకోకుండా కన్నప్ప లో నటించారనే టాక్ ఎప్పటి నుంచి వినిపించడం కాదు విష్ణు నే స్వయంగా చెప్పాడు. అయితే ఇప్పుడు కన్నప్ప విడుదలకు సిద్దమైన తరుణంలో..
కన్నప్ప ప్రమోషన్స్ కి ప్రభాస్ వస్తారా, ఏ ఇంటర్వ్యూ లో అయినా ప్రభాస్ కనిపిస్తారా, కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ రాలేదు, కనీసం కన్నప్ప ట్రైలర్ లంచ్ లో అయినా ప్రభాస్ కనిపిస్తే చాలు అనేది అభిమానుల కోరిక. మాములుగా ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ కే రారు, కన్నప్ప కోసం ప్రభాస్ వస్తారా అనే విషయంలో మాత్రం సస్పెన్స్ నడుస్తుంది. ఒకవేళ వస్తే కన్నప్ప పై భీభత్సమైన అంచనాలు పెరగడం ఖాయం.
Waiting for Prabhas, Kannappa:
Will Prabhas come for Kannappa promotions
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.