
గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ కే కాదు, దర్శకుడు శంకర్ కి పెద్ద డ్యామేజ్, వీళ్ళకి డ్యామేజ్ మాత్రమే కానీ.. నిర్మాత దిల్ రాజు కి మాత్రం కోలుకోలేని దెబ్బ. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లోని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ ఏ విధంగానూ ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. గేమ్ చేంజర్ ప్లాప్ తర్వాత రామ్ చరణ్ ఇమ్మిడియట్ గా దర్శకుడు బుచ్చిబాబు తో కలిసి పెద్ది షూటింగ్ లోకి వెళ్లిపోయారు.
తాజాగా దిల్ రాజు తమ్ముడు శిరీష్ గేమ్ చేంజర్ ప్లాప్ పై కామెంట్స్ చెయ్యడం తమ్ముడు ప్రమోషన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. గేమ్ చేంజర్ దెబ్బకు మా పనైపోయింది అనుకున్నాము, కానీ సంక్రాంతి కి వస్తున్నాం సినిమా మమ్మల్ని ఒడ్డున పడేసింది. అంతా నాలుగు రోజుల్లోనే జరిగిపోయింది. గేమ్ చేంజర్ ప్లాప్ రిజల్ట్ తర్వాత చరణ్ కానీ, శంకర్ కానీ మాకు ఎవరూ ఫోన్ చేసి మాట్లాడింది లేదు.
వాళ్ళను తప్పు బట్టడం లేదు. మేము మంచి సినిమా చేద్దామనుకున్నాం, కానీ కుదరలేదు. మాకు ఇష్టం ఉంది సినిమా చేసాం, డబ్బు పోగట్టుకున్నాం, ఇచ్చిన పారితోషికాలలో ఎవ్వరిని వెనక్కి ఇమ్మని అడగలేదు, చరణ్ తో మా రిలేషన్ బాగానే ఉంది, మంచి కథ వస్తే చరణ్ తో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నాం అంటూ ప్రొడ్యూసర్ శిరీష్ గేమ్ చెంజర్ ప్లాప్ పై స్పందించాడు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.