
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరస ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ క్రేజీగా మారిన రష్మిక మందన్న సక్సెస్ కి సల్మాన్ సికందర్ బ్రేకులు వేసింది. ఆ చిత్రం వల్ల రష్మిక కు కాస్త డ్యామేజ్ అయ్యింది. ప్రస్తుతం సౌత్ పాన్ ఇండియా మూవీ కుబేర తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
తాజాగా రష్మిక మందన్న జీవితంలో ఏదీ శాశ్వతం కాదు ఆ విషయం నాకు తెలుసు అంటూ లైఫ్ లెసన్ చెప్పుకొచ్చింది. ఒకరోజు మనకు బావుంటే, మరుసటి రోజే ఆ పరిస్థితి మారిపోవచ్చు. అలాంటి సమయంలో నా ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ నుంచి లభించే మద్దతు నా అదృష్టం. వారు నాకు అండగా నిలుస్తారు.
నేను అనుకోకుండా యాక్టింగ్ లోకి వచ్చాను, నటిని అవుతానని నేనెప్పుడూ కలగనలేదు. ఇండస్ట్రీలోకి రావడానికి ప్రత్యేకంగా ప్లాన్ లేమి చేసుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేనెంత అదృష్టవంతురాలినో అర్థమవుతోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకున్నాను, కూర్గ్ లాంటి ఒక చిన్న పట్టణంలో పుట్టిన నేను, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే.
ఈ జర్నీలో ఎదురయ్యే సంఘటనలన్నీ పాఠాలు కాదు, అనుభవాలే, ఒకరి కోసం మీ సంతోషాన్ని త్యాగం చెయ్యకండి, మీ సంతోషం కోసం మీరు బ్రతకండి అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.