
పవన్ కళ్యాణ్ తో విడాకులయ్యాక ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య ల సంరక్షణ బాధ్యత తీసుకున్న రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో ఎప్పటికప్పడు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ తర్వాత ఆమె ఎందుకో రెండో పెళ్లి వైపు అడుగులు వెయ్యలేదు.
అయినప్పటికి రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ హైలెట్ అవుతూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ తన రెండో పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయమై మాట్లాడుతూ.. రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను.
కాకపోతే పెళ్లి చేసుకునేందుకు మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. నా లైఫ్ కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, అలాగే ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ రెండో పెళ్లి పై రేణు దేశాయ్ పూర్తిగా ఓపెన్ అయ్యారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.