
ByGanesh
Wed 11th Jun 2025 07:54 PM
ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన్ని ఫేస్ చెయ్యలేక కేసీఆర్ కాలు విరగ్గొట్టుకుని అసెంబ్లీకి రాలేదనే కామెంట్స్ కాదు కాదు మీమ్స్ కనిపించాయి. కొద్దిరోజులుగా కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్ పై యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది అనే ప్రచారం జరిగింది. కవిత తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖ లీకవడం, ఆతర్వాత ఆరుగురు బీఆర్ ఎస్ ఎమ్యెల్యే లతో కాంగ్రెస్ లోకి వెళ్లబోతుంది అన్నారు.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం నేను కాంగ్రెస్ లో ఉన్నంతవరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదు అంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబంలోని ఏ ఒక్కరికీ కూడా.. కాంగ్రెస్లోకి ఎంట్రీ ఉండదని వ్యాఖ్యానించారు.
అసలు తెలంగాణకు శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆర్ కుటుంబమేనని, రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ప్రధాన శత్రువని అంటూ ఆయన కేసీఆర్ ఫ్యామిలీపై ఫైర్ అయ్యారు.
No entry for KCR family members in Congress:
CM Revanth Reddy: No place for KCR and his family in Congress
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.