
ByGanesh
Sun 22nd Jun 2025 06:28 PM
నా చిన్నతనంలో ఇవన్నీ జరిగి ఉంటే తిరిగి కోలుకోవడానికి ఏదో ఒకటి చేసేవాడిని కానీ, ఇప్పుడు అది కుదరడం లేదని కూడా అన్నాడు. 2017లో దుబాయ్‌లో ట్రైజెమినల్ న్యూరల్జియాతో బాధపడుతున్నట్లు సల్మాన్ తాను చెప్పిన విషయాన్ని కూడా తిరిగి గుర్తుచేసుకున్నాడు. ఈ సమస్య కారణంగా కలిగే నొప్పి తీవ్రత కారణంగా తరచుగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని అన్నాడు. ఇది దీర్ఘకాలిక నరాల రుగ్మత.. ముఖానికి ఒక వైపున తీవ్రమైన విద్యుత్ షాక్ లాంటి నొప్పి కలుగుతుంది. నమలడం లేదా పళ్ళు తోముకోవడం వంటి సాధారణ పనులు చేసినప్పుడు కూడా నొప్పి బాధపెడుతుందన్నాడు.
మెదడు అనూరిజం అంటే, మెదడులోని రక్తనాళం బలహీనమైన ప్రదేశం కారణంగా ఉబ్బిపోయే ప్రమాదకరమైన పరిస్థితి. అది పగిలిపోతే ప్రాణాంతక స్ట్రోక్‌కు కారణమవుతుంది. తనకు ఏవీ మాల్ఫార్మేషన్ ఉందని, మెదడులోని అసాధారణ రక్త నాళాలలో అరుదైన చిక్కుముడి ఉందని, చికిత్స చేయకపోతే మూర్ఛలు లేదా రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని కూడా అతడు వెల్లడించాడు. తన పక్కటెముకలు విరిగిపోయిన స్థితిలోను పని చేస్తున్నానని సల్మాన్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఫ్లాప్ షోగా మిగిలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుసగా యాక్షన్ చిత్రాలలో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు.
Salman On his health issues:
Salman Khan and his health issues
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.