
ByGanesh
Fri 06th Jun 2025 12:48 PM
ఈ యాక్సిడెంట్ లో షైన్ టామ్ చాకో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో షైన్ టామ్ చాకో, ఆయన సోదరుడు, మేనేజర్ అనీస్ కూడా ఉన్నారు. వారికి కూడా ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అసలు ప్రమాదం ఎలా జరిగింది అంటే.. శుక్రవారం ఉదయం షైన్ టామ్ చాకో తన కుటుంబంతో కలిసి తండ్రి సీపీ చాకోకు హెల్త్ చెకప్ కోసం త్రిసూర్ నుండి బెంగళూరుకు బయలుదేరగా.. వారి వాహనం పాలకొడ్లోని పయ్యూర్ వద్దకు రాగానే రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షైన్ తండ్రి సీపీ అక్కడికక్కడే మృతి చెందారు. షైన్, ఆయన సోదరుడు జో జాన్ చాకో, అలాగే కారు నడిపిన నటుడి మేనేజర్ అనీస్ గాయాలతో పాలకొడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది.
Shine Tom Chacko father dies in car accident, actor injured:
Malayalam actor Shine Tom Chacko father passes away in car accident
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.