
ByGanesh
Sun 01st Jun 2025 07:45 PM
సమంత నిర్మాణ సారథ్యంలో కొత్త నటులతో తెరకెక్కించిన శుభం చిత్రం ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. సమంత ముందుండి సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రమోట్ చేసింది. సినిమా విడుదలయ్యాక కూడా సినిమాని బాగా ప్రమోట్ చేసారు.
మే 9 న శ్రీవిష్ణు సింగిల్ తో పాటు థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. సమంత శుభం చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ జూన్ 13 నుంచి ఓటీటీ లో వీక్షించేయ్యండి.
Samantha Shubham streaming date locked:
Subham To Stream From June 13 On Jio Hotstar
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.