
ByGanesh
Sun 06th Jul 2025 08:33 PM
ఇక తారా సుతారియా తన ప్రియుడు ఆధార్ జైన్ నుంచి విడిపోయి వీర్ పహారియాతో డేట్ చేస్తోంది. ఆధార్ మాత్రం తన స్నేహితురాలు అలేఖా అద్వానీ వివాహం చేసుకున్నాడు. ఇక తారా – వీరర్ పహారియా ఇటీవల ఇటలీ వెకేషన్ కు వెళ్లారని వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. ఈ జంట బహిరంగ షికార్లతో వార్తల్లో నిలిచారు. కానీ ఆ తర్వాత ఈ జంట కూడా బ్రేకప్ అయింది.
రణబీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ లకు ఆధార్ జైన్ బంధువు. తారా నుంచి విడిపోయాక ఆధార్ ఫిబ్రవరి 2025లో తారా స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నాడు. ఆధార్ నుంచి విడిపోయిన తర్వాత తారా సుతారియా నటుడు అరుణోదయ్ సింగ్‌తో కొంతకాలం సంబంధంలో ఉందని ప్రచారం సాగింది. కానీ ఆమె ఆ పుకార్లను తోసిపుచ్చింది. అతడిని కేవలం `స్నేహితుడు` అని పేర్కొంది.
Tara Sutaria calls her Bollywood journey:
Tara Sutaria
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.