
ByGanesh
Wed 04th Jun 2025 08:32 PM
ప్రభాస్, అనుష్క, మెగాస్టార్ చిరు ముగ్గురు నిన్నటివరకు తమ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎడతెగని సస్పెన్స్ ను చూపించారు తమ తమ అభిమానులకు. జనవరిలో పోస్ట్ పోన్ అయిన విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో మెగా ఫ్యాన్స్ లో అసంతృప్తి తాండవమాడుతుంది. ప్రభాస్ రాజా సాబ్, అనుష్క ఘాటీ లు ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యాయి.
వాటి వాటి రిలీజ్ తేదీలను తాజాగా మేకర్స్ వదిలారు. అందులో అనుష్క ఘాటీ చిత్రాన్ని జులై 11 న విడుదల చేస్తున్నట్టుగా దర్శకుడు క్రిష్ అనౌన్స్ చేసారు. ఆతర్వాత రోజు అంటే నిన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ద రాజా సాబ్ చిత్రాన్ని డిసెంబర్ 5 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మరి అనుష్క, ప్రభాస్ రాక ఖాయమైంది.
కానీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదల తేదీనే రాలేదు. దర్శకుడు వసిష్ఠ విశ్వంభర సీజి వర్క్ కంప్లీట్ అయ్యేవరకు విడుదల తేదీ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. కానీ ఇక్కడ మంచి మంచి డేట్లు అన్ని ఫుల్ అవడంతో మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. అసలు చిరు రాక ఎప్పటికి ఫిక్స్ అవుతుంది అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చెయ్యని రోజు లేదు.
Prabhas and Anushka are coming.. Chiru is left behind:
Vishwambhara Release date suspense
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.