
జగన్ మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు, జైలు లో ఉన్న నేతలను పరామర్శించడాలు కొత్తేమీకాదు. అధికారం లేనప్పుడు శవ రాజకీయాలు చేసే జగన్ తాజాగా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమళ్లేశ్వర రావు విగ్రహవిష్కరణ కోసం బలప్రదర్శన చేసారు. జగన్, వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి రెంటపాళ్లలో హంగామా చేసారు. విగ్రహావిష్కరణ తర్వాత తమ మాజీ మంత్రులను కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ జగన్ పాత పాటే పాడారు.
వైసీపీ నేతలెవరైనా తప్పు చేసి జైలుకెళ్లినా జగన్ మాత్రం వాళ్ళను పరామర్శించి కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది అంటూ మీడియా ముంది స్క్రిప్ట్ తీసుకుని ప్రత్యక్షమవుతాడు. కొడాలి నాని, వల్లభనేని వంశి, పోసాని వీళ్లంతా మంచి వాళ్ళు, కానీ అన్యాయంగా కేసులు పెట్టి కమ్మవారిని ఎదగకుండా కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అంటూ పాత పాటే పాడిన జగన్ మరొకసారి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
తాను అధికారంలోకి వస్తాను, వచ్చాక కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసే పోలీసులను, అధికారులను వదలను వెతికి వెతికి సినిమా చూపిస్తాను అంటూ జగన్ చేసిన కామెంట్స్ చూసి ఎన్నిసార్లు సినిమా చూపిస్తావ్ జగన్ అంటూ కామెడిగా మాట్లాడుతున్నారు. గతంలోనూ జగన్ ఇలా చాలాసార్లు సినిమా చూపిస్తా అంటూ బెదిరించిన విషయం తెలిసిందే.
ఇక తన చుట్టూ ఉన్న జనాల్ని చూసుకుని జగన్ కు కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, మరోసారి అధికారంలోకి వస్తాను అంటూ భ్రమలోకి వెళుతున్నాడు ఇలా సినిమా చూపిస్తాను అంటూ కామెడీ చేస్తున్నాడు అంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్లు పెడుతున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.