ప్రపంచాన్ని కుదిపేయనున్న స్టాక్ మార్కెట్ 2024-2025.. ఇన్వెస్టర్లకు ఆర్థిక వేత్త కీలక వార్నింగ్..

ప్రపంచాన్ని కుదిపేయనున్న స్టాక్ మార్కెట్ 2024-2025.. ఇన్వెస్టర్లకు ఆర్థిక వేత్త కీలక వార్నింగ్..

2024-2025 Crisis: కొత్త సంవత్సరంలో కష్టాలు తీరతాయని చాలా మంది భావిస్తున్నప్పటికీ అది అబద్దమేనని తెలుస్తోంది. నూతన ఏడాది 2024 ప్రజల జీవితాల్లో పెద్ద పీడకలగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

image-2 ప్రపంచాన్ని కుదిపేయనున్న స్టాక్ మార్కెట్ 2024-2025.. ఇన్వెస్టర్లకు ఆర్థిక వేత్త కీలక వార్నింగ్..

2024-2025లో అత్యంత ముఖ్యమైన మార్కెట్ క్రాష్‌ రాబోతోందని ఆర్థికవేత్త హ్యారీ డెంట్ హెచ్చరించారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను నమ్మటం మానేయాలని కోరారు. 2007-2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పెరిగిన మార్కెట్లు ప్రస్తుతం ఓవర్ వ్యాల్యుయేషన్లకు చేరుకున్నందున కుప్పకూలతాయని అన్నారు.

image-1 ప్రపంచాన్ని కుదిపేయనున్న స్టాక్ మార్కెట్ 2024-2025.. ఇన్వెస్టర్లకు ఆర్థిక వేత్త కీలక వార్నింగ్..

అయితే ఈ సారి క్రాష్ 1929-1936 స్థాయికి సమానంగా తీవ్రంగా ఉంటుందని ఎకనమిస్ట్ అంచనా వేశారు. ఈ క్రమంలో S&P 500లో 82% క్రాష్, NASDAQలో 90% క్రాష్, క్రిప్టో మార్కెట్‌లో 96% క్రాష్ నమోదయ్యే అయ్యే అవకాశం ఉందని డెంట్ సూచిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను లాభాల్లో ఉన్నప్పుడే విక్రయించటం వల్ల గణనీయమైన నష్టాలను నివారించవచ్చని సూచించారు. అలాగే భవిష్యత్తులో షేర్ల ధరలు క్షీణించినప్పుడు పెట్టుబడి పెట్టి లాభాలను పొందేందుకు మంచి అవకాశాలను ఇవి అందిస్తాయని సలహా ఇచ్చారు.

Share this content:

Post Comment