IPO News: తుస్సుమన్న ఐపీవో.. గోలచేసి గప్‌చుప్ లిస్టింగ్.. తొలిరోజే నిరాశలో ఇన్వెస్టర్లు..

IPO News: తుస్సుమన్న ఐపీవో.. గోలచేసి గప్‌చుప్ లిస్టింగ్.. తొలిరోజే నిరాశలో ఇన్వెస్టర్లు..

image-50 IPO News: తుస్సుమన్న ఐపీవో.. గోలచేసి గప్‌చుప్ లిస్టింగ్.. తొలిరోజే నిరాశలో ఇన్వెస్టర్లు..

RBZ Jewellers IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టిన రెండవ ఐపీవో పెట్టుబడిదారులను ఊరించి ఉసూరుమనిపించింది. దీంతో చాలా మంది అనవసరంగా పెట్టుబడి పెట్టినట్లు భావిస్తున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఆర్‌బీజెడ్ జ్యువెలర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. మంచి లాభాలు అందుకుంటామని ఇన్వెస్టర్లు ఊహల మధ్య షేర్లు బుధవారం దలాల్ స్ట్రీట్‌లో ఫ్లాట్ అరంగేట్రం నమోదు చేశాయి. ఈ క్రమంలో బంగారు ఆభరణాల తయారీలో ఉన్న కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో నేడు రూ.100 వద్ద ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేయగా.. బీఎస్ఈలోనూ ఇదే ధర వద్ద జాబితా చేయబడింది.

image-49 IPO News: తుస్సుమన్న ఐపీవో.. గోలచేసి గప్‌చుప్ లిస్టింగ్.. తొలిరోజే నిరాశలో ఇన్వెస్టర్లు..

వాస్తవానికి కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను పరిశీలిస్తే రూ.95-100గా నిర్ణయించింది. అయితే నేడు గరిష్ఠ ఇష్యూ రేటు వద్దే జాబితా కావటం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. RBZ జ్యువెలర్స్ కోసం గ్రే మార్కెట్ ప్రీమియం స్వల్పంగా స్థిరంగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో డిసెంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 21న ముగిసింది. తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.100 కోట్లను సమీకరించాలనే లక్ష్యాన్ని అందుకుంది. ఇందుకోసం మెుత్తం 10,000,000 తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది.

ఐపీవో సబ్‌స్క్రిప్షన్ పరిశీలిస్తే.. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్ల వాటా 13.43 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 9.27 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసిన కోటా 24.74 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ RBZ జ్యువెలర్స్ IPO కోసం ప్రత్యేకమైన బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించింది.RBZ జ్యువెలర్స్ కంపెనీ ఏప్రిల్ 2008లో స్థాపించబడింది. పురాతన డిజైనరీ జ్యూవెలరీని రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన భారతీయ ఆభరణాల తయారీదారుగా మార్కెట్లో కొనసాగుతోంది. అహ్మదాబాద్‌కు చెందిన సంస్థ కచేరీలలో జడౌ, మీనా, కుందన్ వర్క్‌లతో కూడిన విభిన్న శ్రేణి పురాతన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిని హోల్‌సేల్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయిస్తోంది.

Share this content:

Post Comment